News February 12, 2025
93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: శ్రీధర్ బాబు

రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించినట్టు సచివాలయంలో తనను కలిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి వివిరించారు. పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన 4 గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది.
Similar News
News March 13, 2025
సత్తెనపల్లి: అల్లుడి చేతిలో.. మామ హతం

సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో అల్లుడు చేతిలో మామ హతమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. దీపాలదిన్నెపాలెంకు చెందిన గంగయ్య(గంగారమ్) తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అల్లుడ్ని మందలించేందుకు వచ్చిన మామ, బావమరిదిపై గంగయ్య గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బత్తుల గంగయ్య(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News March 13, 2025
ఇంటర్ పేపర్లలో తప్పులు.. విద్యార్థుల ఆందోళన

TG: ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సెకండియర్ బోటనీలో 2, గణితంలో ఒక తప్పు, మంగళవారం ఫస్టియర్ పేపర్లలో 3 సబ్జెక్టుల్లో 6 తప్పులు దొర్లాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ అస్పష్టంగా ముద్రించడంతో ఏడో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తామని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.