News June 18, 2024

మేడిగడ్డలో 93 లక్షల టన్నుల ఇసుక మేట

image

TG: మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో దాదాపు 93 లక్షల టన్నుల ఇసుక మేటలు ఉన్నట్లు ఖనిజాభివృద్ధి శాఖ గుర్తించింది. మొత్తం 14 బ్లాకుల్లో ఉన్న ఇసుకను తొలగించి విక్రయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేసేందుకు ఇసుక మేటలు అడ్డుగా ఉన్నాయని, గోదావరికి వరద నీరు వచ్చేలోపు ఆ ఇసుకను తొలగించనున్నట్లు స్పష్టం చేశాయి.

Similar News

News March 31, 2026

పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్

image

AP: పోలీసుల అండతో TDP గూండా రాజ్యం నడుపుతోందని YCP చీఫ్ YS జగన్‌ దుయ్యబట్టారు. గురజాల నియోజకవర్గ నేతలు జగన్‌ను తన నివాసంలో కలిశారు. TDP మూకలు దాడులు చేస్తున్నాయని, FEBలో ఇద్దరిని చంపారని తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ వారి దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని, వ్యవస్థను దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ అందిస్తుందని భరోసా ఇచ్చారు.

News March 31, 2026

రంగులు మార్చే కండోమ్స్

image

సెక్స్ సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు బ్రిటన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు వినూత్న కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారు. ‘S.T. EYE’ పేరుతో కలర్ కండోమ్స్‌ను రూపొందించారు. శరీరంలో బాక్టీరియాతో రియాక్ట్ అవగానే ఇన్ఫెక్షన్‌ను బట్టి కండోమ్ రంగు మారుతుంది. Ex: గ్రీన్ కలర్ వస్తే క్లామిడియా, బ్లూ వస్తే సిఫిలిస్ అని అర్థం. దీంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉంది.

News March 31, 2026

253వ సారి పోటీకి దిగిన ‘ఎలక్షన్ కింగ్’

image

ఎలక్షన్ కింగ్‌గా పేరొందిన పద్మరాజన్(65) TNలోని మెట్టూరు నుంచి 253వ సారి నామినేషన్ వేశారు. ఈయన 1988 నుంచి దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బరిలో నిలుస్తున్నారు. PV, వాజ్‌పేయీ, మోదీ, మన్మోహన్, కరుణానిధి, జయలలిత, స్టాలిన్, పళనిస్వామి వంటి ప్రముఖులపైనా పోటీకి దిగారు. ఇప్పటివరకు డిపాజిట్లకే రూ.కోటికి పైగా ఖర్చు చేయడం గమనార్హం. సామాన్యులు ఎవరితోనైనా పోటీ పడొచ్చని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన చెబుతుంటారు.