News November 1, 2024
ఆ దేశంలో విడాకుల రేటు 94%?

ప్రపంచంలోనే అత్యధికంగా పోర్చుగల్‌లో విడాకుల రేటు 94%గా ఉన్నట్లు ఓ స్టడీ తెలిపింది. ఆ తర్వాత స్పెయిన్ (85%), లక్సెంబర్గ్ (79%), రష్యా (73%), ఉక్రెయిన్ (70%), క్యూబా (55%), ఫిన్లాండ్ (55%), బెల్జియం (53%), ఫ్రాన్స్ (51%), నెదర్లాండ్స్ (48%), కెనడా (47%), యూఎస్ (45%), చైనా (44%), యూకే (41%), జర్మనీ (38%), టర్కీ (25%), ఈజిప్టు (17%), ఇరాన్ (14%), తజికిస్థాన్ (10%), వియత్నాం (7%), ఇండియా (1%) ఉన్నాయి.
Similar News
News January 20, 2026
జోగి సోదరులకు బెయిల్

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News January 20, 2026
4 గంటలుగా కొనసాగుతున్న హరీశ్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలకుపైగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అటు మాజీ మంత్రి విచారణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
News January 20, 2026
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

పశ్చిమ గోదావరి జిల్లా కోర్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు JAN 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అర్హత సాధించి ఉండాలి. వయసు 18 – 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. westgodavari.dcourts.gov.in


