News May 19, 2024

ఈఏపీసెట్ పరీక్షకు 94శాతం హాజరు

image

ఏపీ ఈఏపీసెట్-2024 ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు సెట్ ఛైర్మన్, వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 31,386 మంది విద్యార్థులకు గాను 29,543(94.13%) మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 1843 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. కాగా ఈ నెల 23వరకు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

Similar News

News October 21, 2025

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.

News October 21, 2025

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

image

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.

News October 21, 2025

బొద్దింకను చంపబోయి మహిళ చావుకు కారణమైంది!

image

దక్షిణ కొరియాలో యువతి చేసిన పిచ్చి పని ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒసాన్ నగరంలో తన ఇంట్లోకి వచ్చిన బొద్దింకను చంపేందుకు లైటర్, స్ప్రేను ఉపయోగించింది. ఈ క్రమంలో తన ఫ్లాట్‌కే నిప్పుపెట్టుకుంది. తర్వాత మంటలు మొత్తం అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పొరుగున ఉండే మహిళ చనిపోగా, ఆమె భర్త, 2 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. 30కిపైగా నివాసాలున్న బిల్డింగ్‌లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.