News December 24, 2025

95 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

image

3 రాష్ట్రాలు, ఒక UTలో SIR తర్వాత 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. MPలో 42.74 లక్షల మంది, కేరళలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఛత్తీస్‌గఢ్‌లో 27.34 లక్షల మంది, అండమాన్&నికోబార్‌లో 3.10 లక్షల మంది ఓటర్లలో 64,000 మందికి చోటు దక్కలేదు. తమ ఐడెంటిటీని వ్యక్తిగతంగా చూపించి FEB 21, 2026న ప్రచురించే తుది జాబితాలో పేర్లను చేర్చుకోవడానికి ఈ ఓటర్లకు వారం రోజుల టైం ఇచ్చారు.

Similar News

News February 20, 2026

ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

image

హైదరాబాద్‌ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.

News February 20, 2026

రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగొద్దు: ప్రియాంక

image

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌కు పాక్ ఏజెంట్‌తో <<19086206>>సంబంధాలున్నాయంటూ<<>> అస్సాం సీఎం హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక ఫైరయ్యారు. రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగడం దుర్మార్గమన్నారు. ఎవరూ ఇలా చేయకూడదని స్పష్టం చేశారు. గౌరవ్ సానుకూల, ప్రేమపూర్వక రాజకీయాలు చేస్తారని పేర్కొన్నారు. CM అనవసర విమర్శలు వదిలేసి ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.

News February 20, 2026

నానబెట్టిన మెంతులు మంచివేనా?

image

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.