News March 16, 2024
దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు: రాజీవ్ కుమార్

దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జూన్ 16లోపు ఈ పక్రియ పూర్తి చేస్తామన్నారు.
Similar News
News October 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
News October 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 37 సమాధానాలు

1. నీళ్లు తాగుతున్న శబ్దం విని, జింక అనుకొని దశరథుడు శ్రవణుడ్ని సంహరించాడు.
2. అభిమన్యుడు, ఉత్తరల పుత్రుడు పరీక్షిత్తు.
3. వాయు దేవుడి వాహనం ‘జింక’.
4. విష్ణువు మత్స్య అవతారంలో జలరాక్షసుడైన శంఖాసురుడిని సంహరించాడు.
5. నవతి అంటే తొంబై.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 16, 2025
మీనాక్షితో సురేఖ భేటీ

TG: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను మీనాక్షికి వివరించారు. తన ఇంటికి పోలీసులు రావడం, అక్కడ జరిగిన వివాదంపై చర్చించారు. తన కూతురు వ్యాఖ్యలపైనా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొండా సురేఖ <<18009181>>వివాదంపై<<>> ఏఐసీసీ నివేదిక అడిగిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.