News April 12, 2025

983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని 

image

గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించింది. పట్టణానికి చెందిన ఆమె MPC విభాగంలో ఈ ఘనత సాధించింది. జ్యోతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ విభాగంగాలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 

Similar News

News December 20, 2025

సిరిసిల్ల: ‘ఫెర్టిలైజర్ యాప్‌లోనే ఎరువుల బుకింగ్’

image

ఫెర్టిలైజర్ యాప్‌ను రైతులు డౌన్లోడ్ చేసుకునే విధంగా చూడాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పిఎసిఎస్ సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫెర్టిలైజర్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, యాప్‌కు సంబంధించిన వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాలని అన్నారు. యాప్ ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

News December 20, 2025

సిరిసిల్ల: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఇన్చార్జి కలెక్టర్

image

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు.

News December 20, 2025

నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

image

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9552300009 మనమిత్ర వాట్సాప్ సేవలను అందబాటులోకి తెచ్చిందన్నారు. ఈ-చలానా చెక్, ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్, కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. దీని వలన ప్రజల సమయం ఆదాకావడంతోపాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవుతారు.