News April 12, 2025
983 మార్కులతో సత్తా చాటిన గొల్లప్రోలు విద్యార్థిని

గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించింది. పట్టణానికి చెందిన ఆమె MPC విభాగంలో ఈ ఘనత సాధించింది. జ్యోతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది. కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ విభాగంగాలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
Similar News
News February 11, 2026
వనపర్తి: మర్రికుంటలో మోడల్ పోలింగ్ కేంద్రం

ఓటర్లను ఆకర్షించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా ఎన్నికల ఆథారిటీ ఆదేశాలు ఇచ్చింది. వనపర్తి మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు మర్రికుంట 9/3 పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఆదర్శ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దారు. సెల్ఫీ స్టాండ్, కార్పెట్, బెలూన్లు, తోరణాలతో అందంగా తీర్చిదిద్దడంతో ఆకర్షణగా నిలుస్తోంది.
News February 11, 2026
‘టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా’.. అమెరికాపై పాక్ మంత్రి ఫైర్

అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్‌ను పావుగా వాడుకుంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మండిపడ్డారు. టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. 1999 తర్వాత US మద్దతు కోసం అఫ్గాన్ యుద్ధంలోకి దిగడం తమకు తీరని నష్టం కలిగించిందని వాపోయారు. దశాబ్దాల తర్వాత కూడా పర్యవసానాలు అనుభవిస్తున్నామన్నారు. జిహాద్ పేరుతో తమ పౌరులను పోరాటానికి పంపామని పార్లమెంటులో అంగీకరించారు.
News February 11, 2026
పిఠాపురం బైపాస్ రోడ్డులో విషాదం

పిఠాపురం బైపాస్ రోడ్డులోని సీఐ కార్యాలయం పక్కన ఉన్న బస్ షెల్టర్ వద్ద బొబ్బిలి కృష్ణ (40) అనే వ్యక్తి మృతి చెందారు. మృతుడు పిఠాపురం మండలం రాపర్తికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఇల్లు విడిచి బయట తిరుగుతున్న కృష్ణ, అనూహ్యంగా శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


