News October 23, 2024
99 శాతం సమస్యల్ని పరిష్కరించాం: ఓలా

స్కూటర్ల విషయంలో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని 99 శాతం మేర పరిష్కరించామని ఓలా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఈ నెల 7న CCPA నుంచి సంస్థకు షోకాజ్ నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఫిర్యాదుల్ని పరిష్కరించే అద్భుతమైన వ్యవస్థ మా సంస్థకు ఉంది. 10,644 ఫిర్యాదులు రాగా వాటిలో 99.1శాతాన్ని పరిష్కరించాం’ అని పేర్కొంది.
Similar News
News December 21, 2025
అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం

శబరిమల నుంచి HYD వస్తున్న అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. కడప(D) గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఎదురుగా సిమెంట్ లోడుతో లారీ అడ్డు రావడంతో దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఆ లారీని ఢీకొట్టకపోయుంటే బస్సు లోయలో పడే అవకాశముండేదని, అదే జరిగి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగుండేదని భక్తులు వాపోయారు.
News December 21, 2025
INS సింధుఘోష్‌కు వీడ్కోలు

‘రోర్ ఆఫ్ ది సీ’గా పేరు పొందిన INS సింధుఘోష్ సబ్‌మెరైన్‌కు వెస్టర్న్ నావల్ కమాండ్ నేడు వీడ్కోలు పలికింది. ఇండియన్ నేవీకి 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ రష్యన్ బిల్ట్ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ యాంటీ షిప్పింగ్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో కీలకభూమిక పోషించింది. నీటిపై 20km/h, సముద్ర గర్భంలో 35km/h వేగంతో ప్రయాణించగలదు. 9M36 Strela-3 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్, టార్పెడోలు దీని రక్షణ సామర్థ్యాలు.
News December 21, 2025
రవితేజ కీలక నిర్ణయం!

వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ‘మాస్ మహారాజా’ ట్యాగ్‌ను ఉపయోగించవద్దని సూచించినట్లు డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించారు. మరోవైపు ఈ మూవీకి ఇప్పటివరకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత సైతం వెల్లడించారు. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ మూవీ రవితేజకు హిట్టు లోటు తీరుస్తుందేమో చూడాలి.


