News December 19, 2024

99 శాతం మంది హెల్మెట్లు ధరించట్లేదు: హైకోర్టు

image

AP: 99% మంది హెల్మెట్లు లేకుండా బైకులు నడుపుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల దాఖలైన పిల్ విచారణకు రాగా హైకోర్టు స్పందిస్తూ.. ‘బైక్ నడిపే వ్యక్తే కాకుండా, వెనక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలి. నిబంధనలు పాటించని వారికి ఫైన్ వేసి, 90 రోజుల్లో చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలి. పత్రికలు, టీవీలు తదితర చోట్ల ప్రకటనలివ్వండి’ అని వ్యాఖ్యానించింది. ఆపై విచారణ 3వారాలు వాయిదా పడింది.

Similar News

News February 27, 2026

బ్లడ్ బాత్.. ₹5లక్షల కోట్లు ఆవిరి!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు కోల్పోయి 81,287కు, నిఫ్టీ 317 పాయింట్ల నష్టంతో 25,178 వద్ద స్థిరపడింది. దాదాపు ₹5లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, HCL, ఇన్ఫోసిస్, ఎటర్నల్ మినహా మిగతా షేర్లు అన్నీ నష్టాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత, FII సెల్లింగ్, US-ఇరాన్ చర్చలు కొలిక్కి రాకపోవడం, రూపీ పతనం ఎఫెక్ట్ చూపించింది.

News February 27, 2026

ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

image

AP: ఉగాది(MAR 19) నాటికి లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ తెలిపారు. మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకొనేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దీంతో 40,500 మందికి ₹1,345Cr ఇచ్చేందుకు సమ్మతించారు. కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 27, 2026

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

image

TG: ప్రముఖ క్షేత్రం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరులో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. సౌందర్‌రాజన్ మృతితో ఇవాళ, రేపు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.