News April 12, 2025
991 మార్కులతో అదరగొట్టిన లాస్య

ఇంటర్ ఫలితాలలో సూళ్లూరుపేట విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. సీనియర్ ఎంపీసీలో లాస్య 991, బైపీసీలో నిత్య 985, సీఈసీలో జాహ్నవి రెడ్డి 974 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అలాగే ప్రథమ సంవత్సరం ఎంపీసీలో భాగ్యలక్ష్మి 465, బైపీసీలో కావ్య 426, సీఈసీలో రేణుక 464 మార్కులతో పట్టణ స్థాయిలో అగ్రస్థానాలు దక్కించుకున్నారన్నారు. వారిని అధ్యాపకులు అభినందించారు.
Similar News
News April 19, 2025
సంగారెడ్డి: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాలని చెప్పారు. మరొకరి మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు.
News April 19, 2025
MBNR: నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోకముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. రైతు నష్టపోకుండా విత్తన సంస్థలు,డీలర్లు,నాణ్యమైన లేబుళ్లు ప్యాకింగ్ ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.
News April 19, 2025
వరంగల్ సీపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.