News April 11, 2025
9,970 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తులు

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని RRB ప్రకటించింది. టెన్త్తోపాటు సంబంధిత ట్రేడ్లో ITI లేదా ఇంజినీరింగ్లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. మే 11 చివరి తేదీ.
వెబ్సైట్: www.indianrailways.gov.in
Similar News
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


