News June 30, 2024

9,995 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకి IBPS విడుదల చేసిన నోటిఫికేషన్ <>దరఖాస్తుల<<>> గడువు నేటితో ముగియనుంది. గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తైన వారు అర్హులు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. APలో 450, TGలో 700 పోస్టులున్నాయి. ఫీజు- PwBD, ఎస్సీ, ఎస్టీలు రూ.175, ఇతరులు రూ.850 చెల్లించాలి.

Similar News

News September 20, 2024

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్

image

AP: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్‌ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని CM చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.

News September 20, 2024

ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ ఇలా

image

✒ <>https://www.mines.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లోని ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APSMS) పోర్టల్‌లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
✒ ఆ తర్వాత జనరల్ కన్‌జ్యూమర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
✒ మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
✒ ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.

News September 20, 2024

‘మీసేవ’లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. క్యాస్ట్, ఇన్‌కమ్, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని 5,216 మీసేవా కేంద్రాల ద్వారా 38 శాఖలకు చెందిన 204 రకాల సేవలు అందుతున్నాయి.