News December 4, 2024

డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన శిండే

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్‌నాథ్ శిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. రేపు ఆయన ఫడణవీస్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 4, 2026

అభివృద్ధిని చూసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి: CM

image

TG: ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురేలేదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్గొండ జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ‘3.17 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం వచ్చిన వారు కాంగ్రెస్‌కు ఓటేయాలి. RTCలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్న వాళ్లంతా మాకు ఓటేస్తే BJP, BRSకు డిపాజిట్లు కూడా రావు’ అని పేర్కొన్నారు.

News February 4, 2026

ఎవరు.. ఏ కులం: స్టూడెంట్ల క్యాస్ట్ డేటాపై కసరత్తు

image

TG: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థుల సమాచారాన్నిBC కమిషన్ కులాల వారీగా సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో లెక్కించనుంది. విద్యకు బాగా దూరంగా ఉన్న బీసీ కులాలను గుర్తించి ప్రోత్సహించనుంది. దీనిలో భాగంగా SE డైరెక్టర్ నవీన్ నికోలస్, TGSCHE సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్‌తో కమిషన్ ఇవాళ భేటీ అయింది. మొత్తం స్టూడెంట్ల డేటా వెంటనే ఇవ్వాలంది.

News February 4, 2026

BECILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, డిప్లొమా, ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం జూనియర్ ఇంజినీర్‌కు నెలకు రూ.45వేలు, సూపర్‌వైజర్‌కు రూ.42వేలు, MTSకు 27వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com