News December 4, 2024

చై-శోభిత పెళ్లికి తరలివచ్చిన సెలబ్రిటీలు

image

అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య-శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రానా, అడవి శేష్, కీరవాణి, టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్, సుహాసిని, అశోక్ గల్లా, చందూ మొండేటి తదితరులు హాజరయ్యారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.

Similar News

News March 20, 2026

భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

image

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్‌, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.

News March 20, 2026

తగ్గనున్న డయాబెటిస్ మందుల ధరలు!

image

డయాబెటిస్, ఒబెసిటీ మందుల ధరలు తగ్గనున్నాయి. వీటి చికిత్సలో కీలకమైన సెమాగ్లుటైడ్(ఒజెంపిక్, వెగోవి) పేటెంట్ నేటితో ముగియనుంది. దీంతో ఈ మెడిసిన్‌ను పేటెంట్‌తో పని లేకుండా ప్రభుత్వ అనుమతితో తయారు చేసి విక్రయించేందుకు వీలు దొరకనుంది. దీంతో ధరలు 50-70% తగ్గే అవకాశం ఉంది. తద్వారా ఏటా ₹60 వేలు-70 వేలు ఆదా కానుంది. టైప్-2 డయాబెటిస్ రోగులలో షుగర్ నియంత్రణకు ఒజెంపిక్, ఒబెసిటీ చికిత్సలో వెగోవిని వాడతారు.

News March 20, 2026

నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకోనున్నారు. మంత్రి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి రేణిగుంట, అక్కడి నుంచి తిరుమలకు చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.