News December 4, 2024

కాసేపట్లో ‘పుష్ప-2’ పబ్లిక్ టాక్

image

వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు థియేటర్లలో సినిమాను వీక్షిస్తున్నారు. ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో సినిమా ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపిస్తారా? పుష్ప కంటే పుష్ప-2లో సుకుమార్ అంతకుమించి ఏం చూపించారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మరికాసేపట్లో WAY2NEWS పబ్లిక్ టాక్. STAY TUNED.

Similar News

News January 15, 2026

సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

image

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.

News January 15, 2026

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్ <<>>యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌ 14 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ME, MTech, MS, PhD, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 21నుంచి 24 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cuj.ac.in/

News January 15, 2026

పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

image

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్‌ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.