News December 5, 2024
‘పుష్ప-2’: పబ్లిక్ టాక్

‘పుష్ప-2’ ప్రీమియర్స్ చూసిన అభిమానుల నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ ఎంట్రీ, ఎలివేషన్లు అదిరిపోయాయని పోస్టులు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్ బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు. WAY2NEWS రివ్యూ రేపు ఉదయం.
Similar News
News March 19, 2026
ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లేదా?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకడం లేదు. చెట్లను నరికేయడం, తెగుళ్లతో చనిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వేప పువ్వు దొరుకుతున్నా పట్టణాలు, సిటీల్లో కరవు నెలకొంది. HYDలో కొన్నిచోట్ల చిన్న రెమ్మకే ₹25-30 తీసుకుంటున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయాన్ని పూర్వీకులు సూచించలేదని, అయితే దాని స్థానంలో తులసిని వాడుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.
News March 19, 2026
AP జాబ్ క్యాలెండర్: విభాగాలు.. పోస్టుల వివరాలు

* మే 15: ఉన్నత విద్యలో 1500 <<19422391>>పోస్టులు<<>>
* ఆగస్టు 15: గ్రూప్ I – 91, హోం శాఖ – 2,778, ఇతర శాఖలు – 928
* సెప్టెంబర్ 15: గ్రూప్-II – 750, ఇంజినీరింగ్ – 503, ఇతర శాఖలు – 506
* అక్టోబర్ 15: పాఠశాల/ఇంటర్ విద్య – 3004
** మొత్తం ఉద్యోగాలు – 10,060
-SHARE IT
News March 19, 2026
ఇకపై AP సేవ పోర్టల్‌తో వారికి పథకాలు

AP: భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను వేగంగా, పారదర్శకంగా AP సేవ పోర్టల్ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకం, అంత్యక్రియల సమయంలో ఆర్థికసాయం అందించేందుకు ఓకే చెప్పింది. ఈ 4 పథకాల అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమల్లోకి వచ్చాయని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది.


