News December 5, 2024

పుష్పలో శ్రీవల్లి, షెకావత్ పాత్రల్ని ఎవరు చేయాలంటే..

image

పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక, షెకావత్ రోల్‌లో ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. అయితే, తొలుత ఆ పాత్రల్ని పోషించేందుకు మొదట వేరే నటీనటుల్ని సుకుమార్ సంప్రదించారట. టాలీవుడ్ టాక్ ప్రకారం.. శ్రీవల్లిగా సమంతను తీసుకోవాలనుకోగా ఆమె బిజీగా ఉండటంతో రష్మికను ఎంపిక చేశారు. ఇక షెకావత్ పాత్రకు విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కుదరక మలయాళ నటుడు ఫాజిల్‌ను సుకుమార్ తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News February 23, 2026

ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి నాలుగేళ్లు

image

ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి రేపటితో నాలుగేళ్లు పూర్తికానున్నాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడులకు ఆదేశించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌‌లో 14,999 మంది పౌరులు మరణించినట్లు UN తెలిపింది. 59లక్షల మంది పౌరులు విదేశాలకు వలస వెళ్లిపోయారు. 1.40లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు, 3.25లక్షల మంది రష్యా జవాన్లు చనిపోయినట్లు సమాచారం.

News February 23, 2026

ఆలస్యంగా నిద్రపోతే..

image

ఆరోగ్యంగా ఉండేందుకు డైట్, వ్యాయామంతోపాటు నిద్ర కూడా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే టైమ్‌లో నిద్రపోని, 11PM వరకు మేల్కొనే వారు బరువు తగ్గడంలో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ‘10.30PM తర్వాత జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మేల్కొంటే శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. ఇది బరువుపై ప్రభావం చూపుతుంది. అజీర్ణం, ఉబ్బరం సమస్యలొస్తాయి’ అని హెచ్చరిస్తున్నారు.

News February 23, 2026

గేమ్స్ వద్దు.. ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

image

US సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఏ దేశమైనా గేమ్స్ ఆడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా USను దశాబ్దాలుగా టారిఫ్స్‌తో పీడించిన దేశాలకు గతంలో కంటే ఎక్కువ టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికాతో ట్రేడ్ డీల్‌ను EU హోల్డ్ చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.