News December 5, 2024
అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

అనకాపల్లి జిల్లా పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు SDPO శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.
Similar News
News April 17, 2026
ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. శుక్రవారం ఏయూ సమీక్షలో మాట్లాడరు. ఏప్రిల్ 27న ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే కార్యక్రమానికి సుమారు 25 వేల మంది హాజరుకానున్నారు. వీవీఐపీలు రానున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఎల్ఈడీ స్క్రీన్లు పటిష్ఠంగా ఉండాలన్నారు.
News April 17, 2026
భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.
News April 17, 2026
విశాఖలో మురుగునీటి శుద్ధికి ₹500 కోట్లు

విశాఖ గ్రేటర్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల అనుసంధానానికి ₹500 కోట్లు వ్యయం చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 25% నిధులు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 75% నిధులు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ద్వారా సమకూర్చనున్నట్టు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.


