News December 5, 2024
మంత్రి అనితతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం కలెక్టర్

విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అన్నారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమన్నారు.
Similar News
News September 14, 2025
ఒంగోలు MP మాగుంటకు రెండవ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 84 ప్రశ్నలు అడగటంతోపాటు 6 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 73.53 శాతంగా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
News September 14, 2025
ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.
News September 14, 2025
SP దామోదర్‌కు వీడ్కోలు

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.