News December 5, 2024

సోమశిల జలాశయానికి భారీ వరద

image

సోమశిల జలాశయంలో 71.451 టీఎంసీల నీటిమట్టం నమోదైనట్లు జలాశయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పెరుగుతూ 13,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యానికి మరో ఆరు టీఎంసీల నుంచి ఏడు టీఎంసీల వరకు కావలసి ఉంది. జలాశయం నుంచి కండలేరు వరద కాలువ ద్వారా కండలేరుకు 2000 క్యూసెక్కులు, స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు.

Similar News

News March 30, 2026

నెల్లూరు: నేడు CM.. షెడ్యూల్ ఇదే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో CM చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉదయం 11.30గంటలకు DVసత్రం(M) నెల్లబల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన పుదూరుకు చేరుకుని టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. తర్వాత లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేస్తారు. మధ్యాహ్నం బిరదవాడ వద్ద TDP నాయకులతో సమావేశం, సాయంత్రం 4.45గంటలకు తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో జరిగే P-4 కార్యక్రమానికి హాజరవుతారు.

News March 29, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం..

image

మర్రిపాడు మండలం నందవరంలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుకు గురై గోగుల నవనీత్ (5) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న ఆ చిన్నారిని పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

News March 29, 2026

కావలిలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ దుర్మరణం

image

కావలి రూరల్ వెంకయ్యగారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అంకయ్య కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి కేసు నమోదు చేశారు.