News December 5, 2024
కిమ్ జోంగ్ ఉన్‌లా చంద్రబాబు ధోరణి: VSR

AP: CM చంద్రబాబు ధోరణి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లా ఉందని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. CM నియంతృత్వ ధోరణితో YCP నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ప్రజలు జీవించే హక్కు కోల్పోయి అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News December 28, 2025
బంగ్లాదేశ్‌లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<
News December 28, 2025
న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)తో పాటు డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.


