News December 5, 2024

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు

image

TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మందిలో 44 మంది పాస్ అయ్యారు. వీరికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ సేవలకు వినియోగించుకోనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, స్టైఫండ్ అందిస్తారు.

Similar News

News March 31, 2026

వరికుంటపాడు: లారీని ఢీకొన్న మ్యాజిక్ వాహనం.. మహిళ దుర్మరణం

image

వరికుంటపాడు (M) తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని తిరగల దిన్నె వద్ద ఆగి ఉన్న లారీని మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని హుటాహుటిన కందుకూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 31, 2026

ఈసారీ సత్తా చాటుతారా?

image

ఈ ఐపీఎల్ సీజన్‌లో GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్, PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల ప్రదర్శనపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 175 స్ట్రైక్ రేటుతో అయ్యర్ లాస్ట్ సీజన్‌లో 604 రన్స్ చేయగా గిల్ 155 స్ట్రైక్ రేటుతో 650 పరుగులు చేశారు. ఇటీవల T20WCలో చోటు దక్కకపోవడంతో ఈ సీజన్‌లో రాణించి జట్టులో చోటు దక్కించుకోవాలని గిల్, అయ్యర్‌లు ఆశిస్తున్నారు.

News March 31, 2026

పోలవరంపై ‘వార్’ ఎఫెక్ట్

image

AP: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పోలవరం ప్రాజెక్టుపైనా పడింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ కోసం పక్కనే ఉన్న కొండల నుంచి రాయిని తొలిచేందుకు ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది. ఇటీవల బ్లాస్టులకు వాడటంతో అమ్మోనియం నైట్రేట్ కొరత ఏర్పడింది. దీంతో 30శాతం బ్లాస్టింగ్ పనులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఇక డయాఫ్రమ్ వాల్ పనులు అనుకున్న గడువులోగానే పూర్తవుతున్నాయని వెల్లడించారు.