News December 5, 2024
మానవ తప్పిదం.. మనుగడకు ప్రమాదం.!

జీవ మనుగడకు నేలే ప్రధానం. ఆహారం, ఆవాసం అందించేది ఆ నేలతల్లే. మానవ తప్పిదాల వల్ల నేడు అది తీవ్ర క్షీణతకు గురవుతోంది. కృత్రిమ రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలతో సారం కోల్పోతోంది. వీటివల్ల ఇప్పటికే భారత్‌లో 8కోట్ల హెక్టార్లు నిస్సారమవగా, ప్రపంచవ్యాప్తంగా 30శాతం పంటభూములు క్షీణించాయి. అభివృద్ధి పేరిట చేస్తున్న స్వార్థపూరిత చర్యలను వీడితేనే పుడమితల్లిని కాపాడుకోగలం.
*నేడు అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం.
Similar News
News March 28, 2026
నేటి నుంచే IPL సమరం

వేసవిలో వినోదాన్ని పంచేందుకు IPL సిద్ధమైంది. నేటి నుంచి రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. నేడు జరిగే తొలిపోరులో SRH, RCB తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచులు జరగ్గా SRH 14, RCB 11 గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారీ హిట్టర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇవాళ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News March 28, 2026
కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.
News March 28, 2026
వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. నేడు అసెంబ్లీలో బిల్లు

TG: ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, Dy.CM భట్టి 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


