News December 5, 2024

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. వివరాలిలా.. హవేళిఘణాపూర్ మండలం సుల్తానాపూర్‌కు చెందిన నీల(40) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఔరంగాబాద్ శివాలరులో మృతదేహం లభ్యమైంది. గజ్వేల్‌ పానీపూరి బండి నడుపుతున్న వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. బెజ్జంకికి చెందిన ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా బుధవారం తోటపల్లి చెరువు వద్ద అనుమానాస్పందగా మృతిచెందాడు.

Similar News

News March 11, 2026

MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

News March 11, 2026

ఫైల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సెక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.

News March 10, 2026

అవయవ మార్పిడి పాలసీపై మంత్రి సమీక్ష

image

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అవయవ మార్పిడి చట్టం(THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి దామోదర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ దానాలను ప్రోత్సహించే విధంగా విధానాలను సరళీకృతం చేయాలని, చికిత్స ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.