News December 5, 2024
విశాఖ సెంట్రల్ జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు

విశాఖ సెంట్రల్ జైలు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన ఎస్.కిషోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఎం.వెంకటేశ్వర్లుపై జైలుశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జైలు లోపలకు గంజాయి వెళ్లడం, రాత్రి వేళల్లో ఫోన్లలో మాట్లాడించడం, శిక్షపడ్డ ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడడం వంటి ఘటనల నేపథ్యంలో వీరిపై వేటు వేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు.
Similar News
News March 14, 2026
విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.
News March 13, 2026
వివాదాస్పద ఖర్చుల చెల్లింపులకూ గ్రీన్ సిగ్నల్(2/2)

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం రాళ్లు తరలింపు, యోగాంధ్ర కార్యక్రమంలో వినియోగించిన వీఐపీ మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు జీవీఎంసీ సమావేశంలో అంగీకరించారు. కూర్మన్నపాలెం ఎంవీవీ ఎంకే పార్కుకు నీటి సరఫరా పైపులకు రూ.46.60 లక్షలు, ట్యాంకర్ల బిల్లులకు రూ.19.20 లక్షలు, ఫాగింగ్‌కు రూ.80 లక్షలు, వీధి కుక్కల శస్త్రచికిత్సలకు రూ.45 లక్షల చెల్లించెందుకు ఆమోదం తెలిపారు.
News March 13, 2026
జీవీఎంసీ చివరి సమావేశం.. వివాదస్పద నిర్ణయాలకు ఆమోదం(1/2)

జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన అజెండాలోని 193 అంశాలతో పాటు టేబుల్ అజెండా కలిపి మొత్తం 294 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 293 అంశాలను సభ్యులు ఆమోదించారు. గతంలో వివాదాస్పదంగా మారి వాయిదా పడిన ప్రతిపాదనలకూ స్వల్ప చర్చతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాలుగు రోజుల్లో పాలకవర్గ గడువు ముగియనున్న నేపథ్యంలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలనూ అడ్డుకోకుండా ఆమోదించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


