News December 5, 2024

జ్వరమొచ్చిందా? ఇవి తినండి!

image

చలికాలం వైరల్ ఫీవర్స్ అధికంగా వస్తాయి. జ్వరమొచ్చినప్పుడు పాలకూర తినాలి. ఇందులో ఉండే ఎ,ఇ,సి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచుతాయి. ఇవి శరీరంలోని వ్యాధికారక క్రిములతో పోరాడి నాశనం చేస్తాయి. ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇక అల్లం, వెల్లుల్లి, పసుపు, తులసిలో ఉండే యాంటీ వైరల్ గుణాలు జ్వరం నుంచి ఉపశమనం కల్పిస్తాయి.

Similar News

News March 14, 2026

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

image

AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు’ అని ట్వీట్ చేశారు.

News March 14, 2026

కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

image

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.

News March 14, 2026

2027 FEB వరకు టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

image

☛ ఈ ఏడాది జూన్ 6-20 వరకు AFGతో 1టెస్ట్, 3 వన్డేలు, ఆ తర్వాతి వారంలో IREతో 3 T20లు
☛ జులై 1-19 ENGతో 3వన్డేలు, 5 టీ20లు, JULY, AUGలో SLతో 3 టీ20లు, 2 టెస్టులు
☛ SEPలో AFGతో 3 టీ20లు, BANతో 3ODIs, 3 టీ20లు, ZIMతో 3 టీ20లు. ☛ SEP 25-OCT 3 ఏషియన్ గేమ్స్, WIతో 3 ODIs, 5 టీ20లు
☛ OCT-DECలో 5 ODIs, 5 టీ20లు, 2టెస్టులు, SLతో 3 ODIs, 3T20Is
☛ 2027 JAN-FEBలో AUSతో 5 టెస్టులు