News December 5, 2024

సంచలనం: 20 ఓవర్లలో 349 రన్స్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. సిక్కింతో మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో 349/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భాను పూనియా 51 బంతుల్లో 134 రన్స్‌తో ఊచకోత కోశారు. అతడి ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 5 ఫోర్లున్నాయి. శివాలిక్ శర్మ 55, అభిమన్యు సింగ్ 53, సోలంకి 50 రన్స్‌తో రాణించారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సిక్కిం 20 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది.

Similar News

News November 3, 2025

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.

News November 3, 2025

పాపికొండల బోటింగ్ షురూ

image

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.

News November 3, 2025

ఈ వరి రకం.. ముంపు ప్రాంత రైతులకు వరం

image

MTU 1232.. ఇది 15 నుంచి 20 రోజుల పాటు వరద ముంపును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం. పంటకాలం 140 రోజులు. పైరు తక్కువ ఎత్తు పెరిగి, గింజ సన్నగా ఉంటుంది. బియ్యం శాతం అధికం. దోమ పోటు, అగ్గి తెగులు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సాధారణ భూమిలో 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో 30-35 బస్తాల దిగుబడినిస్తుంది. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.