News December 5, 2024
బ్రాండ్లలో అమితాబ్, SRKలను అధిగమించిన ధోనీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733375377127_695-normal-WIFI.webp)
క్రికెట్లోనే కాదు యాడ్స్‌లోనూ ధోనీ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లోనే 42 బ్రాండ్లను దక్కించుకుని షారుఖ్, అమితాబ్‌లను వెనక్కు నెట్టినట్లు TAM మీడియా రీసెర్చ్ వెల్లడించింది. ఆయన ఖాతాలో క్లియర్‌ట్రిప్, మాస్టర్ కార్డ్, గల్ఫ్ ఆయిల్ లాంటి టాప్ బ్రాండ్లున్నాయి. అన్ని ఛానళ్లలో బచ్చన్(16H), SRK(20H) కంటే ధోనీ(14) స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉన్నప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది.
Similar News
News February 5, 2025
కారు యజమానులకు GOOD NEWS!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763765830_367-normal-WIFI.webp)
నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.
News February 5, 2025
ఈ నెల 10న కొడంగల్‌లో BRS రైతు దీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738764184898_367-normal-WIFI.webp)
TG: సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఈ నెల 10న బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించనుంది.
News February 5, 2025
రూ.1,126కోట్ల రైతుభరోసా నిధులు జమ: కాంగ్రెస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738763479140_782-normal-WIFI.webp)
TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ప్రారంభించిన రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు రూ.1,126కోట్లు జమ అయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఇవాళ ఒక్క రోజే 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని, మొత్తం ఇప్పటి వరకు 21.45 లక్షల మందికి నిధులు అందాయని స్పష్టం చేసింది. ఎకరాకు రైతు బంధు రూ.5వేలే వచ్చేవని, రైతు భరోసా కింద రూ.6వేలు అందుకుంటున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.