News December 5, 2024

ఇంటి నిర్మాణానికి రూ.5,00,000.. వీరికే ప్రాధాన్యం: సీఎం

image

TG: అర్హులైన వారికే ప్రభుత్వ ఇళ్లు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ఏడాదిలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తొలి దశలో SC, ST, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కోటా అమలు చేస్తామన్నారు.

Similar News

News March 22, 2026

రేషన్‌కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

image

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News March 22, 2026

SRH బౌలింగ్ వెరీ వీక్: అభినవ్

image

SRH బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉన్నప్పటికీ బౌలింగ్ వీక్‌ అని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. ‘బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్ ఉంటే బౌలింగ్‌కు 1/10 మాత్రమే. జయ్‌దేవ్, హర్షల్‌పైనే పేస్ భారం ఉంది. మిగతా వాళ్లకు అనుభవం లేదు. టాలెంటెడ్ పేసర్లు ప్రఫుల్, ఓంకార్, షకీబ్ ఉన్నప్పటికీ ఒక్క మ్యాచూ ఆడలేదు. వేలంలో స్పెషలిస్టు బౌలర్లను కాకుండా లివింగ్‌స్టోన్‌ను కొనడం ఆశ్చర్యం కలిగించింది’ అని పేర్కొన్నారు.

News March 22, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇవే

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 రోజుల్లో రూ.63.08 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. మొత్తంగా రూ.53.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. మూడో రోజు శనివారం 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.