News December 5, 2024

నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప-2 OTT రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో సంక్రాంతి తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు థియేట్రికల్ రన్ కొనసాగిస్తామని మూవీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News March 21, 2026

రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.

News March 21, 2026

ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్ గాంధీ

image

రూపాయి విలువలో క్షీణత, ఇండస్ట్రియల్ డీజిల్ ధరల హైక్ దేశంలో ద్రవ్యోల్బణానికి సంకేతాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇది మామూలేనని కేంద్రం తోసిపుచ్చినా రవాణా ఖర్చులు పెరగడం, MSMEలపై భారం, నిత్యావసర సరకుల ధరల పెంపు, FII సెల్లింగ్‌తో స్టాక్ మార్కెట్లపై భారం పడనుందనేది నిజమన్నారు. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని, దీనిని ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌కు ప్లాన్ లేదని విమర్శించారు.

News March 21, 2026

US మినహాయింపు ఇచ్చినా ఇరాన్ ఆయిల్ రావడం కష్టమే?

image

చమురు కొరత నేపథ్యంలో ఇరాన్ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఈ క్రూడ్ కొనడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఇరాన్ తమ వద్ద సర్‌ప్లస్ ఆయిల్ లేదని షాక్ ఇచ్చింది. హార్ముజ్‌ను బ్లాక్ చేసిన ఇరాన్ USపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇలా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌కు ఇరాన్ ఆయిల్ రావడం ప్రశ్నార్థకమైంది. 2018లో US ఆంక్షలకు ముందు ఇరాన్ క్రూడ్ అతిపెద్ద బయ్యర్‌గా భారత్ ఉండేది.