News December 5, 2024

100 పరుగులకే భారత్ ఆలౌట్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత మహిళల జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మెగన్ 5 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించారు. టీమ్ ఇండియా బ్యాటర్లలో రోడ్రిగ్స్(23)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆస్ట్రేలియా టార్గెట్ 101.

Similar News

News January 13, 2026

క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? IT నోటీసు రెడీ..

image

మీ సంపాదనకు.. క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయ పన్ను శాఖ మీపై గురి పెడుతుంది. ఫ్రెండ్స్ కోసం స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ పేరుతో మనీ సర్క్యులేట్ చేయడం, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు బుక్కైనట్టే. వాలెట్ లోడింగ్, భారీ క్యాష్ బ్యాక్ లావాదేవీలను IT నిశితంగా గమనిస్తోంది. అనుమానం వస్తే నోటీసులు పంపుతుంది. ఆధారాలు చూపలేకపోతే ఆ ఖర్చును అక్రమ ఆదాయంగా పరిగణిస్తుంది.

News January 13, 2026

జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

image

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

News January 13, 2026

BMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్(<>BMRCL<<>>) 7 డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్ఠ వయసు 55ఏళ్లు కాగా, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 48ఏళ్లు. GMకు నెలకు రూ.2,06,250, DGMకు రూ.1,64,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.bmrc.co.in