News December 5, 2024

పుష్ప-2పై విశాఖ జనసేన నేత ట్వీట్

image

పుష్ప-2 హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విశాఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టిస్తోన్న పుష్ప-2 బెనిఫిట్ షోలు వేసుకొనడానికి అనుమతిచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన, చేస్తున్న కృషి.. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్థికంగా తన స్థాయిని పెంచడానికి దోహదపడుతుంది. YCP ప్రభుత్వం ఉంటే నిర్మాతలతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి పడేది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.

News July 11, 2025

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

image

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’‌ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది.‌ సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది.‌ గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది.‌ అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.‌ కైలాసగిరిపై ఇది‌ మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.

News July 11, 2025

కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు

image

కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు నిర్మించనున్నామని V.M.R.D.A. ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.‌ 360 డిగ్రీ రివాల్వింగ్ ఫైన్ డైన్ రెస్టారెంట్, బే వ్యూ కేఫే కూడా అందుబాటులోకి రానున్నాయి.‌ వీటి కోసం RFP విడుదల చేయునున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను V.M.R.D.A., ప్రైవేట్ పెట్టుబడిదారులకు పరస్పర లాభదాయకంగా (విన్-విన్) ఉండేలా నిర్మించనున్నారు.