News December 5, 2024

కియా కార్ల పరిశ్రమను సందర్శించిన మంత్రులు

image

పెనుకొండ మండల పరిధిలోని అమ్మవారుపల్లి వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాశ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం సందర్శించారు. కియా కార్ల తయారీ, పరిశ్రమ చిరిత్రపై తెలుసుకున్నారు. అనంతరం కియా కార్మికులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 650 ఎకరాల్లో ఏర్పాటైన కియా కార్ల ప్లాంట్‌ను 2019లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే.

Similar News

News March 25, 2026

పురపాలికల్లో వార్డుల పెంపునకు కసరత్తు

image

అనంతపురం జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలైంది. జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 204 వార్డులకు అదనంగా 50 పెరగనున్నాయి. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 254కు చేరనుంది. వార్డుల విభజన వల్ల హద్దులు మారడంతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్య పెరగనుంది.

News March 25, 2026

అనంతపురం: యువకుడి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

image

అనంతపురం ఆర్టీసీ బస్టాండు వద్ద ఈ నెల 22న జరిగిన ఆదర్శ నాయుడు హత్య కేసులో ఐదుగురు నిందితులను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో పదునైన టైల్స్ ముక్కతో పొడవడంతో యువకుడు మృతి చెందాడు. నిందితులు బన్నీ, కరుణాకర్ రెడ్డి, రాకేష్, అస్మిత్ చౌదరి, ఉజ్జినప్పలను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు యువకులే కావడం గమనార్హం.

News March 25, 2026

సౌత్ జోన్‌కు ఎంపికైన SKU విద్యార్థులు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఖోఖో టీంకు 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రిజిస్ట్రార్ రమేశ్ విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని వారికి సూచించారు. వీరందరూ ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని దావనగెరెలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొననున్నారన్నారు.