News December 5, 2024
ఐరాల: హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఐరాలలో చోటుచేసుకుంది. చిత్తూరు-పీలేరు జాతీయ రహదారిపై ఐరాల మండలం చుక్కవారిపల్లి వద్ద బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న తెల్లగుండ్లపల్లికి చెందిన ఆత్మయ్య మృతి చెందగా.. సురేశ్ గురవయ్య గాయపడ్డారు. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
చిత్తూరులో మహిళ మృతి

చిత్తూరులో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని పీసీఆర్ సర్కిల్లో 45 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళ మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారించగా రెండు రోజులుగా అదే ప్రాంతంలో ఆమె ఉన్నట్టు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 08572 234100 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News January 13, 2026
చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
News January 13, 2026
చిత్తూరు: కరెంట్ వైర్లతో జాగ్రత్త..!

సంక్రాంతి సందర్భంగా కరెంట్ వైర్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని చిత్తూరు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. గాలిపటాలు కరెంటు వైర్ల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా ఎగురవేయాలని, లోహపు దారాలతో పతంగులు ఎగరవేయరాదని కోరారు. ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ 1912కు ఫోన్ చేయాలన్నారు.


