News December 5, 2024

అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోండి: చంద్రబాబు

image

AP: ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల ఆందోళనల ఘటనలపై కృష్ణా జిల్లా కలెక్టర్‌తో CM చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్ల అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.

Similar News

News November 12, 2025

పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

image

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఫిన్‌లాండ్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

News November 12, 2025

టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి?

image

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

News November 12, 2025

విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

image

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.