News December 5, 2024

నో డేటా.. కేంద్రం తీరుపై విమర్శలు

image

డిజిట‌ల్ యుగంలోనూ ప‌లు అంశాలకు సంబంధించి త‌మ వ‌ద్ద డేటా లేద‌ని కేంద్రం చెప్పడం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. దేశంలో ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల వాటిల్లిన న‌ష్టం అంచ‌నా, మెడిక‌ల్ ఇంట‌ర్న్‌ల ఆత్మ‌హ‌త్య‌లు, విద్యాసంస్థ‌ల్లో ఎస్సీ, ఎస్టీల‌పై వేధింపులు, పేప‌ర్ లీకుల‌పై వివరాల్లేవని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం వైఖరి విస్మయానికి గురిచేస్తుందని విమర్శిస్తున్నాయి.

Similar News

News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.

News March 14, 2026

దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

image

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News March 14, 2026

రెండోసారి తల్లయిన నటి పూర్ణ

image

టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త ఆసిఫ్ ఆలీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా డెలివరీ అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ 2022లో వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో బాబుకు జన్మనిచ్చారు. ఈమె తెలుగులో సీమ టపాకాయ్, అవును, సుందరి, అఖండ తదితర చిత్రాల్లో నటించారు.