News December 5, 2024

ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు

image

TG: గత నెల 30న ఏడుగురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్‌గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్ర హింసలు పెట్టి హతమార్చినట్లు తెలిపింది. ఈ హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

Similar News

News March 22, 2026

ఈ IPL సీజన్ గిల్‌కు మంచి అవకాశం: పుజారా

image

IPL-2026లో శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడితే భారత T20 జట్టులో తిరిగి స్థానం పొందే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘గిల్ క్వాలిటీ ప్లేయర్. T20 WC జట్టులో చోటు దక్కకపోవడం అతడిలో కసిని పెంచి ఉంటుంది. ఈ IPL సీజన్ మంచి అవకాశం. 150-160SRతో బ్యాటింగ్ చేయగలనని నిరూపించుకోవాలి. ఈ టైమ్‌లో అతడిపై ఒత్తిడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. IPLలో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

News March 22, 2026

వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్ల ఏర్పాటు

image

AP: పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ బయో గ్యాస్‌(CBG)గా మార్చే ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుండగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.59.85కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి CBG ప్లాంట్ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది.

News March 22, 2026

కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

image

కేరళంలోని కోళికోడ్‌ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్‌ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.