News December 5, 2024

‘సయ్యద్ ముస్తాక్ అలీ’లో షమీ సోదరుడి అరంగేట్రం

image

భారత పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ తరఫున అరంగేట్రం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్లో పేర్కొన్న షమీ, తమ్ముడికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ఈ స్థాయి టోర్నీలో డెబ్యూ చేయడం ఓ మైలురాయి. నీ పట్ల గర్విస్తున్నా. ప్రయాణాన్ని ఆస్వాదించు. మన కుటుంబమంతా నీవెనుక ఉంది’ అని విష్ చేశారు. కాగా తొలి మ్యాచ్‌లో కైఫ్ 4 ఓవర్లకు 44 రన్స్ ఇచ్చారు. వికెట్లేవీ తీయలేకపోయారు.

Similar News

News March 18, 2026

జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

image

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.

News March 18, 2026

2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

image

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించినట్లు మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.

News March 18, 2026

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.