News December 6, 2024
పుష్ప-2 అదిరిపోయింది: రుహానీ శర్మ

పుష్ప-2 సినిమా అదిరిపోయిందని హీరోయిన్ రుహానీ శర్మ ట్వీట్ చేశారు. ‘సినిమాలోని వైల్డ్‌నెస్‌ని ఇంకా ప్రాసెస్ చేసుకుంటూనే ఉన్నా. మూవీ ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. భారత సినిమా సరిహద్దులు దాటడం కాదు బద్దలుకొడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. 3గంటల 15 నిమిషాల పాటు నేను వేరే ప్రపంచానికి వెళ్లిపోయా. గోల్డ్ స్క్రీన్‌లో చూడటం వల్ల విజిల్స్ కుదరలేదు. మాస్ థియేటర్లో ఇంకోసారి చూస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 20, 2026
IPL: ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్.. నెట్టింట ట్రోల్స్

IPL కీలక ప్లేయర్లు గాయాలబారిన పడి లీగ్‌కు దూరం అవుతున్నారు. దీంతో IPLను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎల్లిస్(CSK), సామ్ కరన్(RR), హర్షిత్(KKR), మిల్నే(RR), జాక్ ఎడ్వర్డ్స్(SRH), హసరంగా(LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. ఇక హేజిల్ వుడ్(RCB), కమిన్స్(SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28న లీగ్ ప్రారంభమయ్యేలోపు ఇంకెంత మంది ఇలా గాయాలబారిన పడతారో?
News March 20, 2026
చలాన్ కట్టకపోతే లైసెన్స్, RC ఫ్రీజ్!

TG: సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, RC ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.
News March 20, 2026
అజహరుద్దీన్ మంత్రి పదవికి డెడ్‌లైన్ గండం!

TG: మంత్రిగా కొనసాగుతున్న అజహరుద్దీన్‌కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగియనుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపైనే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో చూడాలి.


