News December 6, 2024
కడప: ‘రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలి’

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతుల భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి ఈనెల 6వ తేదీ నుంచి వచ్చేనెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు.
Similar News
News January 12, 2026
వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News January 12, 2026
జిల్లా పోలీస్ కార్యాలయానికి 74 అర్జీలు

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను(PGRS) జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావు నిర్వహించారు. బాధితుల నుంచి 74 పిర్యాదులను ఆయన స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి
వాటిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. త్వరితగతిన అర్జీలను పరిష్కారం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.
News January 12, 2026
‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.


