News December 6, 2024
యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ. 9గం.లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డూ, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 2, 2026
బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు: నల్గొండ ఎస్పీ

నార్కట్‌పల్లిలో ఇవాళ గ్రామసభలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ‘అలైవ్ అండ్ అరైవ్’ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సభలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
News April 2, 2026
నల్గొండ: సదరం శిబిరాల షెడ్యూల్ ఖరారు

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెల ‘సదరం’ శిబిరాల గడువును అధికారులు ప్రకటించారు. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం విభాగాల వారీగా తేదీలు కేటాయించారు. శారీరక వైకల్యానికి ఈ నెల 7, 16, 21, 23.. మానసిక స్థితికి 8, 22.. దృష్టి లోపానికి 9, 28.. శ్రవణ లోపానికి 6, 13, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులు మీ-సేవ లేదా UDID పోర్టల్‌లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
News April 2, 2026
నల్గొండ: నేడు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం జిల్లాకు విచ్చేయనున్న త్రిపుర గవర్నర్‌కు స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిప్పర్తి మండల కేంద్రంలో జరగనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభకు హాజరై, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు.


