News December 6, 2024

పిట్లం: ప్రాణాలంటే మరీ ఇంత నిర్లక్ష్యమా..! 

image

పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించవద్దని అధికారులు పదే పదే చెపుతున్నా..కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు పై చిత్రమే నిదర్శనం. ఇలా ప్రయాణించే పలువురు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేకం ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఓ తుఫాన్ టాప్‌పై ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృష్యామిది.

Similar News

News March 14, 2026

NZB: ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు.. 51 మంది గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది హాజరైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. వివిధ కారణాలతో 51 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీఈవో స్పష్టం చేశారు.

News March 14, 2026

NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్: సీపీ

image

నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని 144 కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు సీపీ పి.సాయి చైతన్య తెలిపారు. పరీక్షా సమయాల్లో కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News March 13, 2026

NZB: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి’

image

బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (SRI)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి VC నిర్వహించారు.