News December 6, 2024

పుష్ప-2 రీసెర్చర్‌గా కడప జిల్లా వాసి

image

పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్‌ సుకుమార్‌ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్‌గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

Similar News

News March 21, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,800
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,616
*వెండి 10 గ్రాముల ధర రూ.2310

News March 20, 2026

సిద్ధవటంలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

image

సిద్ధవటంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పర్వదినం (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు సిద్ధవటం శివారులోని ఈద్గాలో జమాఅత్ ప్రారంభమై అనంతరం ప్రత్యేక నమాజ్ నిర్వహించనున్నట్లు ముత్తవల్లి సయ్యద్ నజరే ఆలం ఖాద్రి తెలిపారు. నెల రోజుల పాటు ముస్లింలు పాటించిన కఠోర ఉపవాసాలు నేటితో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News March 20, 2026

రైతుల నుంచి అధికంగా వసూలు చేస్తే చర్యలు: జ్యోతి

image

ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాలుకు రూ.75లు మించి వసూలు చేస్తే ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకుంటామని మార్క్ ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి హెచ్చరించారు. ప్రొక్యూర్ మెంట్ కేంద్రాల్లో రైతులందరికీ బహిరంగంగా కనిపించేలా ఛార్జీల వివరాలను, ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.