News December 6, 2024

రేపు రాష్ట్రానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ వస్తున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ అన్న నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ కూడా హాజరవుతారు.

Similar News

News March 25, 2026

చమురు వణుకుపుట్టిస్తోంది!

image

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్‌తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్‌గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

image

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.