News December 6, 2024
విశాఖ: కామాంధునికి పాతికేళ్ల జైలు శిక్ష

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధునికి విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పులో భాగంగా నిందితునికి 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.1,25,000 జరిమానా విధించింది. సబ్బవరం మండలానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా శిక్ష విధించారు.
Similar News
News July 11, 2025
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాలని సూచించారు. దోమల నివారణలో భాగంగా వీధులలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని చెప్పారు.
News July 11, 2025
1,371 పాఠశాలలో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్: DEO

విశాఖ జిల్లాలో 1,371 పాఠశాల్లో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్ నిర్వహించినట్లు DEO ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. తోటగరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎన్జీవో కాలనీలో ఎంపీ శ్రీభరత్, గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ గణబాబు, అనందపురం లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని వివరించారు.
News July 10, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో త్వరలో క్యాప్సూల్ హోటల్

విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మొదటి అంతస్తులో త్వరలో క్యాప్సూల్ హోటల్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు DRM లలిత్ బోహ్ర గురువారం తెలిపారు. మొత్తం 88 రూమ్‌లతో కలిగిన హోటల్లో ప్రత్యేకంగా 18 రూములు మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.200, 3-24 గంటల వరకు రూ.400, డబుల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.300, 3-24 గంటలకు రూ.600 అద్దె ఉంటుందన్నారు.