News December 6, 2024

ప.గో: 111 మంది ఉద్యోగుల తొలగింపు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 111 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ డీఎంహెచ్‌వో శర్మిష్ట గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతలున్నప్పటికీ మెరిట్ లేకుండా పొందిన ఉద్యోగ నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవో 1207ని కొట్టి వేస్తూ ఉద్యోగాలు పొందిన వారు మెరిట్‌ప్రకారం రిక్రూట్ అయిన వారిని కొనసాగించాలని నవంబరు 29న తుదితీర్పులో కోర్టు ఆదేశించింది.

Similar News

News March 24, 2026

ప.గో కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో జల జీవన్ మిషన్ పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో కలెక్టర్ చదలవాడ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణ సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

News March 24, 2026

పాలకోడేరు: PGRSకు 14 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP అదాన్ నయీం అస్మి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు SP వెల్లడించారు.