News December 6, 2024

సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి: కలెక్టర్ చేతన్

image

గ్రామ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదును తప్పనిసరిగా చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో వెనుకబడిన ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

Similar News

News April 1, 2026

అనంతపురం జిల్లాలో 102.4 మి.మీ వర్షపాతం నమోదు

image

అనంతపురం జిల్లాలో 102.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మండలాల వారీగా గుత్తిలో 31.2 మి.మీ, కంబదూరులో 34.6 మి.మీ, ఉరవకొండలో 28.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే సెట్టూరు 14.6 మి.మీ, వజ్రకరూరు 5.8 మి.మీ, బ్రహ్మసముద్రంలో 5.0 మి.మీ వర్షపాతం నమోదైంది.

News March 31, 2026

నిబంధనలు పాటించలేదా ఇకపై చర్యలు తప్పవు: ఏఎస్పీ

image

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు భద్రతే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తాడిపత్రి బైపాస్‌లో టౌన్ సీఐ ఆరోహణరావుతో కలిసి నిబంధనలు పాటించని పలు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా.. హెల్మెట్లు ధరించని వాహనదారులకు రూ.1,035 జరిమాన విధించారు. హెల్మెట్లు తప్పకుండా ధరించాలని సూచించారు.

News March 30, 2026

సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దాం: కలెక్టర్

image

పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా.. సోమవారం అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.