News December 6, 2024

మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ఎగ్జామ్స్?

image

AP: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్ విద్యా మండలి ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. అలాగే ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను బోర్డు ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

Similar News

News March 11, 2026

‘విజయ’ పేరిట కల్తీ నెయ్యి.. పరీక్షిస్తామన్న మంత్రి లోకేశ్

image

AP విజయ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతోందని TGDDCF ఛైర్మన్ <<19324480>>అమిత్ రెడ్డి<<>> చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ స్పందించారు. మార్కెట్ నుంచి రాండమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. TGDDCF వద్ద ఉన్న CALF, NDDB టెస్ట్ రిపోర్ట్స్‌ను కూడా పరిశీలిస్తామన్నారు. క్వాలిటీ, కస్టమర్ల ఆరోగ్యం విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. మేఘనా ఫుడ్స్‌కు విజయ(AP) ఫ్రాంచైజీ ఇచ్చారు.

News March 11, 2026

నెక్స్ట్ T20 కెప్టెన్‌ సంజూ కావొచ్చు: కైఫ్

image

సూర్యకుమార్ ఫిట్‌గా ఉన్నంత కాలం T20 టీమ్ కెప్టెన్‌గా కొనసాగొచ్చని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. ఒకవేళ ఆయన తప్పుకొంటే కెప్టెన్‌గా సంజూ శాంసన్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం కలిసొస్తుందని పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన 31 ఏళ్ల సంజూ టీమ్‌ను నడిపించగల సమర్థుడని కొనియాడారు.

News March 11, 2026

మోదీ పాలనలో క్యూలే మిగిలాయి: కాంగ్రెస్

image

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ హయాంలో దేశ ప్రజలు నిరంతరం లైన్లలోనే గడపాల్సి వస్తోందంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో 2016 నోట్ల రద్దు సమయంలో ATMల వద్ద పడ్డ కష్టాలు, కరోనా సెకండ్ వేవ్ వేళ ఆక్సిజన్ కోసం, ప్రస్తుతం వంట గ్యాస్ (LPG) కోసం క్యూ కట్టడాన్ని ఎత్తిచూపింది. మోదీ పాలనలో కేవలం క్యూలే మిగిలాయని సెటైరికల్ ట్వీట్ చేసింది.