News December 6, 2024

NZB: బాలికపై లైంగిక దాడి.. ఇద్దరి రిమాండ్

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిని, అతడికి సహకరించిన మరొకరిని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్పల్లి CI మల్లేశ్ తెలిపారు. అక్టోబర్ 1న జక్రాన్‌పల్లికి చెందిన యువకుడు ఓ బాలికను నమ్మించి నిర్మల్‌లోని వెంకటసాయి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 31న అజయ్‌ని అరెస్ట్ చేశారు. కాగా లాడ్జ్ మేనేజర్ సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.

Similar News

News March 1, 2026

నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

News March 1, 2026

NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.

News March 1, 2026

NZB: పీఎంశ్రీ పాఠశాలలను పరిశీలించిన సెంట్రల్ నోడల్ అబ్జర్వర్

image

జిల్లాలో పీఎం శ్రీనిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు.